నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలిచి చేసేదేమీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆ పార్టీకి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, ఈయన గెలిస్తే ఏడో నెంబర్ అవుతాడే తప్పా.. చేసేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు.
ఏడో నెంబర్ అవుతాడే తప్పా చేసేదేమీ ఉండదు: తలసాని - telangana latest news
కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడటం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలిస్తే ఏడో నెంబర్ అవుతాడే తప్పా చేసేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడటం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్, పోలీసులు స్పందించాలన్నారు. ఈ సందర్భంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్న నాయకుడు సీఎం కేసీఆరే అని వ్యాఖ్యానించారు. రేపు జరగబోయే సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు.