పారిశుద్ధ్యం, పచ్చదనంపై ఇంటింటికి తిరుగుతూ మహిళలకు శిక్షణనివ్వాల్సిన బాధ్యత పురపాలికల్లోని వార్డుల కమిటీలపై ఉందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. అపరిశుభ్రతకు తావు లేకుండా రాబోయే రోజుల్లో పట్టణాల్ని ఎక్కడికక్కడే సుందరీకరించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండ పురపాలికలో మంత్రి పర్యటించారు. డిండి రహదారిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి... తొమ్మిది, పదో వార్డుల్లోని స్థానికులతో ముచ్చటించి... సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పౌర సేవలే ప్రధాన లక్ష్యం..
పౌరులు కేంద్ర బిందువులుగా, పౌర సేవలే ప్రధాన లక్ష్యంగా నూతన పురపాలక చట్టాన్ని తీసుకువచ్చామని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. హక్కుల గురించి ప్రశ్నించినప్పుడు ప్రజలు... బాధ్యతలనూ గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. రానున్న ఆరు నెలల్లో ప్రతి పట్టణంలో మెరుగైన వసతులు కనిపించాలని అధికారులను ఆదేశించారు.