నకిరేకల్ పురపాలిక ఎన్నికల్లో సీఎం కేసీఆర్పై విశ్వాసంతో తెరాసను గెలిపించిన పట్టణ ప్రజలకు... మంత్రి జగదీశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా... ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే రూ.11 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు.
'ఎన్నికల హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తాం'
సీఎం కేసీఆర్పై ఉన్న విశ్వాసంతో మినీ పుర ఎన్నికల్లో ప్రజలు తెరాసకు పట్టం కట్టారని... మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నకిరేకల్ పురపాలికలో తెరాసను గెలిపించిన పట్టణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు మంత్రితో పాటు... నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుభాకాంక్షలు తెలిపారు.
నకిరేకల్ పుర ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు మంత్రి జగదీశ్ రెడ్డి అభినందనలు
ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ నీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ పరిధిలో శ్మశానవాటిక, పార్కులు మొదలైన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసే ప్రజలు తెరాసకు పట్టం కట్టారని... నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించిన పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.
ఇదీ చదవండి: అ.ని.శా, విజిలెన్స్ చేతికి దేవరయంజాల్ భూముల విచారణ