నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లాలోని మర్రిగూడ బైపాస్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఆరు లైన్ల రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. అలాగే 6 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన తరగతి గదులకు భవన నిర్మాణానికి శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు.
అనంతరం అక్కడి నుంచి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి... కేంద్ర వ్యవసాయ చట్టాలతో మార్కెట్ కమిటీలు, వ్యవసాయ మార్కెట్లు నామమాత్రంగా ఉంటున్నాయని వెల్లడించారు. అంతిమంగా రైతులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు.