సాగర్ ఎన్నికల్లో తెరాసనే గెలవటం ఖాయమని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ప్రచారంలో భాగంగా తిరుమలగిరి మండలం తెట్టెకుంట, ఆల్వాల గ్రామాల్లో తెరాస అభ్యర్థి నోముల భగత్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి కలసి ప్రచారం నిర్వహించారు.
'పదవులు అనుభవించారు... అభివృద్ధి మరిచారు' - నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ప్రచారంలో భాగంగా తిరుమలగిరి మండలం తెట్టెకుంట, ఆల్వాల గ్రామాల్లో తెరాస అభ్యర్థి నోముల భగత్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి కలసి ప్రచారం నిర్వహించారు.
minister jagadish reddy campaign in nagarjuna sagar by election
ప్రభుత్వం తెచ్చిన అనేక సంక్షేమ పథకాలు అమలు చేయటం వల్ల అన్ని వర్గాల ప్రజలు తెరాస వెంటే ఉన్నారని మంత్రి తెలిపారు. గత పాలకులు పదవులు అనుభవిస్తూ అభివృద్ధి చేయడం మర్చిపోయారని విమర్శించారు. తెరాస ప్రభుత్వంలో నోముల నర్సింహాయ్య హయాంలోనే అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.