నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటించారు. భారీ వర్షాల వల్ల అమ్మనబోలులో కొట్టుకుపోయిన మూసీ కాలువ వంతెనను పరిశీలించారు. వంతెన లేకపోవడం వల్ల మోత్కూర్ నుంచి నార్కెట్పల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
అమ్మనబోలు మూసీ బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి జగదీశ్ - telangana power minister jagadish reddy
నల్గొండ జిల్లా అమ్మనబోలు గ్రామంలో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన మూసీ వంతెనను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పరిశీలించారు. తక్షణమే తాత్కాలిక రోడ్డు నిర్మించి రాకపోకలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
![అమ్మనబోలు మూసీ బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి జగదీశ్ minister jagadish inspected musi bridge in nalgonda district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9187427-598-9187427-1602769517766.jpg)
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి
నల్గొండ-యాదాద్రి జిల్లాలను కలిపే దారి కావడం వల్ల తక్షణమే తాత్కాలిక రహదారి నిర్మించి రాకపోకలు పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించారు. విపత్తు వల్ల ఇబ్బందులు తలెత్తకుండా.. శాశ్వత పరిష్కారంగా.. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.