నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులో శ్రీ పార్వతీజడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంత్రి గుంటకండ్ల జగదీశ్ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి - రామలింగేశ్వర స్వామి సేవలో మంత్రి జగదీశ్ రెడ్డి
రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చెర్వుగట్టు రామలింగేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ జరిగే ఉత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు.
రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి
దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి ఆశీస్సులతోనే కృష్ణా, గోదావరి, మూసీ నదుల నీటితో ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలంగా మారుతోందని మంత్రి పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిందని వెల్లడించారు.
ఇవీ చూడండి:మేడారం ఎఫెక్ట్: అమాంతం పెరిగిన 'బంగారం' ధర