తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు అని చెప్పుకోవడానికి భయపడే రోజులుండేవి: మంత్రి జగదీశ్​రెడ్డి

కేసీఆర్​ ఏం చేశాడని.. ఓ పెద్దాయన అంటున్నారని.. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో ఆకలి, ఆత్మహత్యలు లేకుండా చేశారని.. మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్​ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నిడమనూరులోని పలు గ్రామాల్లో నోముల భగత్​ తరఫున ఓట్లు అభ్యర్థించారు.

nagarjuna sagar by elections
నాగార్జునసాగర్​ ఉపఎన్నిక ప్రచారంలో జగదీశ్​రెడ్డి

By

Published : Apr 9, 2021, 4:04 PM IST

తెలంగాణ ఏర్పడే నాటికి రైతు అని చెప్పుకోవడానికే భయపడే రోజులు ఉండేవని.. మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే వ్యవసాయాన్ని పండగ చేసి చూపారన్నారు. కేసీఆర్​ ఏం చేశాడని.. ఓ పెద్దాయన అంటున్నారని.. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో ఆకలి, ఆత్మహత్యలు లేకుండా చేశాడని నాగార్జునసాగర్​ కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డిని ఉద్దేశించి.. జగదీశ్​రెడ్డి అన్నారు.

నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో.. తెరాస అభ్యర్థి నోముల భగత్​ తరఫున మంత్రి జగదీశ్​రెడ్డి ప్రచారం చేశారు. ఓటు ఎంతో విలువైందని.. మాయమాటలు చెప్పే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కేవలం తుమ్మడం గ్రామంలో.. రైతుబంధు, రుణమాఫీ, చెరువుల అభివృద్ధి, కరెంటు, మంచినీళ్లకు, పింఛన్లకు రూ. 22.50 కోట్లు ప్రతినెలా ఖర్చు అవుతున్నాయని జగదీశ్​రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దళారీ వ్యవస్థే లేదని.. నేరుగా లబ్ధిదారులకు అన్ని పథకాలు అందే విధంగా అమలుచేస్తున్నారని మంత్రి చెప్పారు.

రైతు అని చెప్పుకోవడానికి భయపడే రోజులుండేవి: మంత్రి జగదీశ్​రెడ్డి

ఇవీచూడండి:సాగర్​ పోరు: ప్రభావితం చేసే ప్రత్యర్థిపైనే దృష్టి

ABOUT THE AUTHOR

...view details