నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 14వ మైలు వద్ద రేపు జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య పరిశీలించారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మరో 6 లిఫ్ట్ పథకాలను సీఎం ప్రాంభించనున్నారు. అనంతరం జిల్లా ప్రజల కోసం ధన్యవాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు.
హాలియాలో సీఎం సభకు సర్వం సిద్ధం. - minister jagadeeshwar reddy visit in haliya
నల్గొండ జిల్లా హాలియాలో జరుగనున్న సీఎం కేసీఆర్ సభా ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. సభకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపిన మంత్రి... ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
![హాలియాలో సీఎం సభకు సర్వం సిద్ధం. minister jagadeeshwar reddy on cm meeting in haliya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10555849-307-10555849-1612856963994.jpg)
minister jagadeeshwar reddy on cm meeting in haliya
'హాలియా సభకు సర్వం సిద్ధం... విజయవంతం చేయండి'
ఈ ధన్యవాద సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరు అయ్యే అవకాశం ఉందని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ధన్యవాద సభలో ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, రాష్ట్ర నాయకులు అధికారులు ఉన్నారు.