అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి - minister
మిర్యాలగూడలో మంత్రి జగదీశ్వర్రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్ అద్భుతాలు చేసి చూపించారన్నారు.
![అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3823701-thumbnail-3x2-jaggu.jpg)
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జగదీశ్వర్రెడ్డి శంకుస్థాపన చేశారు. భారత దేశంలో నిజమైన సెక్యులర్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం తెలంగాణేనని ఆయన వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం 1000కోట్ల బడ్జెట్ను మొదటిసారి తెరాస ప్రభుత్వం కేటాయించిందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్ ఎన్నో అద్భుతాలు చేసి చూపించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమంత్రి పాలనలో కలసి మెలసి జీవిస్తూ సుఖంగా సుభిక్షంగా ఉన్నారని తెలియజేశారు.
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి