"ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువలు త్వరలో పూర్తి చేస్తాం" - minister_visit
నల్గొండ జిల్లా చిట్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరలోనే ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువలను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగు నీరు అందించే ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువలు త్వరగా పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి సహా 500మంది కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారానని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. నియోజకవర్గం ప్రజలకు సాగు, తాగు నీరు అందించటమే తన లక్ష్యమన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అన్ని పురపాలికల్లో సత్తా చాటుతుందన్నారు.
TAGGED:
minister_visit