పల్లెప్రగతి కార్యక్రమం మాదిరిగానే పట్టణ ప్రగతినీ విజయవంతం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన పట్టణ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు.
పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలి: మంత్రి జగదీశ్‌రెడ్డి - updated news on minister jagadeeshreddy
నల్లొండ జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో పట్టణ సమ్మేళన్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పట్టణ ప్రగతినీ విజయవంతం చేయాలి: మంత్రి జగదీశ్‌రెడ్డి
పట్టణాల్లో పర్యావరణ సమస్యను అధిగమించడానికి హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేకంగా మున్సిపాలిటీల్లో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లు, ప్రభుత్వ అధికారులు, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతినీ విజయవంతం చేయాలి: మంత్రి జగదీశ్‌రెడ్డి
ఇవీ చూడండి:ఇదే చివరి సమావేశం: జస్టిస్ ధర్మాధికారి