జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో గుంటకడ్ల సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్, సుంకరీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు, యువతకు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు అవసరమన్నారు.
చదువులోనే కాదు క్రీడల్లోనూ రాణించాలి: జగదీశ్ రెడ్డి - నల్గొండ జిల్లా తాజా వార్తలు
యువత చదువులోనే కాదు క్రీడల్లో కూడా రాణించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో కీర్తి శేషులు గుంటకడ్ల సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్, సుంకరీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు.
![చదువులోనే కాదు క్రీడల్లోనూ రాణించాలి: జగదీశ్ రెడ్డి minister Jagadeesh reedy inaugurated cricket tournament in nalgonda district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10705903-thumbnail-3x2-jahadeesh.jpg)
చదువులోనే కాదు క్రీడల్లో రాణించాలి: జగదీష్ రెడ్డి
యువత చదువులోనే కాదు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:మన 'సారా' సేవ చేస్తోందీ సాఫ్ట్వేర్ ఇంజినీర్