ఎన్నికల్లో హామీలు ఇవ్వకున్నా... పథకాల్ని రూపొందించి వాటిని అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని గుర్తు చేశారు. నల్గొండలో పర్యటించిన మంత్రి... వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుంకరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో చేపట్టిన దుప్పట్ల పంపిణీని కార్యక్రమాన్ని ప్రారంభించి... రోగులకు అందజేశారు. రోగుల బంధువులు సేదతీరేందుకు నిర్మించనున్న షెడ్డుకు భూమి పూజ చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు.
'రాష్ట్రంలోని ఆడపడుచులకు పెద్దన్న సీఎం కేసీఆర్' - 'రాష్ట్రంలోని ఆడపడుచులకు పెద్దన్న సీఎం కేసీఆర్'
రాష్ట్రంలోని ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నల్గొండలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందించారు.
!['రాష్ట్రంలోని ఆడపడుచులకు పెద్దన్న సీఎం కేసీఆర్' MINISTER JAGADEESH REDDY VISITED NALGONDA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5431226-thumbnail-3x2-ppp.jpg)
MINISTER JAGADEESH REDDY VISITED NALGONDA