వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే రైతుబంధు డబ్బులు లబ్ధిదారుల వారి ఖాతాల్లో జమ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. త్రిపురారం మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే పల్లెల్లో రైతు వేదికలు నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల మేలు కోసం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని వెల్లడించారు. త్రిపురారం మండలకేంద్రంతో పాటు పెద్దదేవులపల్లి, నిడమనూరు మండలంలోని కోటయ్యగూడెం, ముప్పారం గ్రామల్లో రైతు వేదికలను ప్రారంభించారు.