నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో ఉన్న పట్టభద్రులను గుర్తించి.. జాబితా తయారు చేసుకొని ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు.