Harish rao comments on BJP: ఏ డిమాండ్ల సాధన కోసం రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారని మంత్రి హరీశ్‌రావు మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రశ్నించారు. తన స్వార్థం కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారని ఆరోపించారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారన్నారు. రాష్ట్రానికి ఏదైనా ఇచ్చామని భాజపా నేతలు ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను తిట్టి ఓట్లు అడగటం తప్ప... ఏమైనా ఇచ్చామని చెప్పారా? అని మండిపడ్డారు. ఐదేళ్లుగా భుజం మీద బిందె పెట్టలేదని ఆడబిడ్డలు చెప్తున్నారని వెల్లడించారు.
కేసీఆర్‌ను తిట్టి ఓట్లు అడగటం తప్ప... ఏమైనా ఇచ్చామని చెప్పారా?: హరీశ్‌రావు
Harish rao comments on BJP: మునుగోడు ఉపఎన్నికతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. తెరాస, భాజపా నేతలు ఇరువురు ఒకరికి ఒకరు ప్రత్యక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు. మరోసారి మంత్రి హరీశ్‌రావు భాజపా ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను తిట్టి ఓట్లు అడగటం తప్ప... ఏమైనా ఇచ్చామని చెప్పారా? అని ప్రశ్నించారు.
''పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధర ఎంతపెంచినా మాకే ఓట్లు వేస్తున్నారని మోదీ అనుకుంటున్నారు. మునుగోడులోనూ ఓట్లు వేస్తే సిలిండర్ ధరను మోదీ ఇంకా పెంచుతారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధర పెంచటం వల్లే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. రైతులు వ్యవసాయానికి వాడుతున్న విద్యుత్ లెక్కలు చెప్పాలని మోదీ అడుగుతున్నారు. మన పొరుగున ఉన్న అన్ని రాష్ట్రాలు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాయి. కేసీఆర్ మాత్రం తెలంగాణలో మీటర్లు పెట్టనీయనని చెప్పారు. మంచినీళ్ల బాధను తీర్చింది కేసీఆర్. మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ ఇళ్లను రాజగోపాల్‌రెడ్డి నిర్మించలేదని'' హరీశ్‌రావు వివరించారు.
ఇవీ చదవండి: