కొత్త చట్టాల వల్ల రైతులు మద్దతు ధర పొందే అవకాశం లేకుండా పోతోందని ఎమ్మెల్యే భాస్కరరావు పేర్కొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని రామచంద్రగూడెం వై జంక్షన్ వద్ద తెరాస శ్రేణులు నిర్వహించిన రాస్తారోకోలో ఆయన పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై వంటావార్పుతో నిరసన వ్యక్తం చేశారు.
మద్దతు ధరకు గుదిబండగా కొత్త చట్టాలు : భాస్కరరావు - భారత్ బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే భాస్కరరావు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ఆమోదయోగ్యంగా లేవని ఎమ్మెల్యే భాస్కరరావు తెలిపారు. భారత్ బంద్‌కు మద్దతుగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెరాస శ్రేణులు చేపట్టిన రాస్తారోకో ఆయన పాల్గొన్నారు. రహదారిపై వంటావార్పుతో నిరసన తెలియజేశారు.

నూతన చట్టాల వల్ల రైతులకు మద్దతు ధర లేకుండా పోతోంది : భాస్కరరావు
కేంద్రప్రభుత్వం తీసుకవచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఒక ఎంపీగా ఉండి ఏరోజైనా వ్యవసాయ చట్టాలపై ప్రజలకు వివరించారా అని ప్రశ్నించారు. రహదారిపై ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే భాస్కరరావును, నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఠాణాకు తరలించారు.