నాగార్జున సాగర్, ఆంధ్రప్రదేశ్ అంతర్ రాష్ట్ర సరిహద్దు దగ్గర గత మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్న వలస కార్మికులకు విముక్తి దొరికింది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మొత్తం 243 మంది వలస కార్మికులకు పరీక్షలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అనుమతిచ్చారు. పరీక్షలు నిర్వహించిన ప్రతీ ఒక్కరికి ఒంటిమీద హోం క్వారంటైన్ ముద్ర వేసి ఆరు బస్సుల్లో వారిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. గత మూడు రోజులుగా దశదశలుగా వలస కార్మికులు సరిహద్దుకు చేరుకున్నా ఆంధ్రప్రదేశ్ అధికారులు సకాలంలో స్పందించలేదని వలస కార్మికులు వాపోయారు.
వలస కూలీలకు మోక్షం.. మూడు రోజుల తర్వాత రాష్ట్రానికి - Migration Labor Sent To Andhra Pradesh
గత మూడురోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతర్ రాష్ట్ర సరిహద్దు వద్ద స్వస్థలానికి వెళ్లేందుకు పడిగాపులు కాస్తున్న వలస కార్మికులు ఎట్టకేలకు స్వరాష్ట్రంలోకి అడుగు పెట్టారు.
వలస కూలీలకు మోక్షం.. మూడు రోజుల తర్వాత రాష్ట్రానికి