నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్పోస్ట్ వద్ద ఆంధ్ర వెళ్లడానికి వలస కూలీలు బారులు తీరారు. సుమారు 600 మంది చెక్పోస్ట్ వద్దకు చేరుకున్నారు. తెలంగాణ పోలీసులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనుమతి పత్రాలు ఇచ్చి పంపుతున్నారు. కానీ ఎటువంటి ఆదేశాలు లేవని ఆంధ్రప్రదేశ్లోని పొందుగుల వద్ద తిప్పి పంపిస్తున్నారు.
వాడపల్లి చెక్పోస్ట్ వద్ద బారులు తీరిన వలస కూలీలు - వాడపల్లి చెక్పోస్ట్ వద్ద వలస కూలీలు
స్వస్థలాలకు వెళ్లేందుకు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్పోస్ట్ వద్దకు పెద్ద ఎత్తున వలస కూలీలు వస్తున్నారు. ఇక్కడ పరీక్షలు చేసి పంపించినప్పటికీ... ఆంధ్రప్రదేశ్ అధికారులు తమకు ఎలాంటి ఆదేశాలు లేవని నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![వాడపల్లి చెక్పోస్ట్ వద్ద బారులు తీరిన వలస కూలీలు migrant labor reach to vadapally check post for go to andhrapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7054871-thumbnail-3x2-asdf.jpg)
వాడపల్లి చెక్పోస్ట్ వద్ద బారులు తీరిన వలస కూలీలు
ద్విచక్ర వాహనాల మీద కొంతమంది, నడుచుకుంటూ హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరాకరించడం వల్ల లబోదిబోమంటున్నారు. చిన్న పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆహారం, తాగునీరు అందించి తమ ఆదుకుంటున్నారు.