తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డెక్కిన వలస కూలీలు... కాలినడకన 600 మంది పయనం - యాదాద్రి పవర్‌ప్లాంట్‌ ఎదుట కార్మికుల ఆందోళన

నల్గొండ జిల్లాలో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపించాలని ధర్నాకు దిగారు. అధికారులు స్పందించకపోవడం వల్ల కాలినడకన 600 మంది వలన కూలీలు బయలుదేరారు.

migrant-laborers-protest-in-front-of-the-yadadri-power-plant-at-nalgonda-district
రోడ్డెక్కిన వలస కూలీలు... కాలినడకన 600 మంది పయనం

By

Published : May 11, 2020, 2:52 PM IST

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం యాదాద్రి పవర్‌ప్లాంట్‌ ఎదుట కార్మికుల ఆందోళన చేపట్టారు. స్వస్థలాలకు పంపించాలంటూ పవర్‌ప్లాంట్‌ వద్ద వలస కార్మికులు ధర్నాకు దిగారు.

ఈనెల 5న కూడా వలస కార్మికులు ఆందోళనకు దిగారు. కూలీలు ఆందోళనకు దిగడం వల్ల ఈనెల 9న 107 మందిని అధికారులు పంపించారు. 3 బస్సుల్లో బిహార్‌, ఝార్ఖండ్‌, బంగాల్‌, యూపీ రాష్ట్రాలకు కూలీలను తరలించారు. మిగతావారిని కూడా తరలించాలంటూ వలస కూలీల ఆందోళన చేపట్టారు. అధికారులు స్పందించకపోవడం వల్ల కాలినడకన 600 మంది వలస కూలీలు బయలుదేరారు.

ఇవీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?

ABOUT THE AUTHOR

...view details