నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఆంధ్ర ప్రాంతానికి చెందిన సుమారు 70 మంది వలస కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ సాగర్ సరిహద్దు చెక్ పోస్ట్ వద్దకు చేరుకోగా వారికి ఆంధ్ర అధికారులు అనుమతి ఇవ్వకపోవటం వల్ల మళ్లీ తెలంగాణలోకే పంపించారు.
ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు వద్ద వలస కూలీల కష్టాలు - Migrant laborers clash at Sagar check post
హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్లిన సుమారు 70మంది వలస కూలీలను నాగార్జునసాగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
![ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు వద్ద వలస కూలీల కష్టాలు Migrant laborers clash at Sagar check post in Telanagana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6605642-146-6605642-1585638017871.jpg)
ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల వద్ద 70మంది కూలీల అడ్డగింత
ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల వద్ద 70మంది కూలీల అడ్డగింత
సాగర్ పోలీసులు వారికి స్థానిక పోలీస్ గ్రౌండ్‌లో తాత్కాలిక ఏర్పాట్లు చేసి అక్కడే ఉంచారు. హైదరాబాద్‌లో పోలీసుల అనుమతి పత్రం తీసుకొచ్చినా ఆంధ్రప్రదేశ్‌లోకి అనుమతి ఇవ్వకపోవటం వల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు పంపించాలని ఏపీ అధికారులకు విన్నవించుకున్నారు.
ఇవీచూడండి:తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య