లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు సన్నాహాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూడు కలెక్టరేట్ల పరిధిలోని వివిధ శాఖల అధికారులు కార్మికుల సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. వీరిని రెండు దశల్లో గుర్తిస్తున్నారు. కార్మిక., పరిశ్రమల శాఖల్లో పేర్లు నమోదు చేసుకున్న వారి వివరాలు ఇప్పటికే ఆయా కలెక్టర్లకు అందాయి. మొదటి దశలో వీటిని సేకరించారు. రెండో దశలో మిగిలినవారు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
భువనగిరి జిల్లాలో ఇప్పటికే రెండు దశలను పూర్తిచేశారు. ఇక్కడ మొదటిదశలో 22 వేల మందిని గుర్తించగా, రెండోదశలో ఆరు వేల మందిని గుర్తించారు. విభాజ్య నల్గొండ జిల్లాలో 15,925 మందిని అధికారికంగా గుర్తించారు. వీరిలో మన రాష్ట్రానికి చెందిన ఇతర జిల్లాల వారు 551 మంది ఉన్నారు. మిగిలిన వారిని త్వరలోనే గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో 6,579 మంది వలస కూలీలను ఇప్పటివరకు గుర్తించారు. పెద్దవూర మండలం చలకుర్తి వద్ద జవహర్ నవోదయ విద్యాలయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అనేకమంది విద్యార్థులు శిక్షణ నిమిత్తం మధ్యప్రదేశ్ వెళ్లి అక్కడే ఉండిపోయారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వీరందరిని సొంత ప్రాంతాలకు చేరుస్తామని జిల్లా యంత్రాంగం తెలిపింది.
ఇటుక బట్టీ కార్మికులే అధికం
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటుకబట్టీ కార్మికులు అధికంగా ఉన్నారు. చౌటుప్పల్, బొమ్మలరామారం, మిర్యాలగూడ, మునుగోడు, ఆలేరు, నకిరేకల్ ప్రాంతాల్లో.. ఒడిశా, బిహార్, చత్తీస్‌ఘఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారే అధికంగా ఉన్నారు. రెండో స్థానంలో ఉమ్మడి జిల్లాకు సరిహద్దు ప్రాంతాలైన గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వీరంతా నల్గొండ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి ప్రాంతాల్లో ఎప్పటినుంచో పనిచేస్తున్నారు.
వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తే.. బిహార్ నుంచి వచ్చిన హమాలీలు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉంటారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉమ్మడి జిల్లాలో చాలా తక్కువగా ఉన్నారు. కృష్ణపట్టి ప్రాంతంలోని దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో పలు పరిశ్రమలున్నాయి. సిమెంట్, రైస్ మిల్లులు అధికంగా ఉన్నాయి. వీటిల్లో పనిచేసేందుకు బిహార్, గుజరాత్, ఒడిశా, చత్తీస్‌ఘడ్ ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్ఛి. లాక్‌డౌన్ నేపథ్యంలో చిక్కుకుపోయారు.