మార్కెటింగ్ సదుపాయం లేక నల్గొండ జిల్లా బత్తాయి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ సీజన్లో ఆశించిన మేర పంట చేతికందుతున్నా... లాక్డౌన్ కారణంగా దిగుబడులను తరలించే మార్గం లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. నల్గొండ జిల్లాలో 47 వేల ఎకరాల్లో బత్తాయి వేశారు. 16, 900 మంది రైతులు... ఈ పంటపైనే జీవనాధారం సాగిస్తున్నారు.
బత్తాయి రైతులకు మార్కెటింగ్ కష్టాలు - Nalgonda Orange Farmers
లాక్డౌన్ వల్ల బత్తాయి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఆశించిన మేర పంట చేతికందినా మార్కెటింగ్ సదుపాయం లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.
బత్తాయి రైతులకు మార్కెటింగ్ కష్టాలు
దిల్లీ, హైదరాబాద్ మార్కెట్లకు పంపాల్సి ఉన్నా... కరోనా తీవ్రత వల్ల అక్కడా కొనుగోలు చేసే వాతావరణం లేకుండా పోయింది. ఏటా స్థానికంగానే కాయల్ని కొనుగోలు చేసే ట్రేడర్లు సైతం ముఖం చాటేయడం వల్ల రైతులు అయోమయంలో పడిపోయారు. ఇబ్బందులు పడుతున్న రైతులతోపాటు నల్గొండ జిల్లా ఉద్యాన శాఖ అధికారితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...