గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని నాటకీయ ఫక్కీలో... వెంటపడి మరీ నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నకిరేకల్ బైపాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, ఓ స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది.
సినిమా ఫక్కీలో ఛేజింగ్.. 57 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం
నల్గొండ జిల్లా నకిరేకల్ బైపాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వాహనంలోని 57 ప్యాకెట్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
సినిమా ఫక్కీలో వాహన ఛేజింగ్.. 57 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం
పోలీసులు ఉన్నారని గమనించి ఆపకుండా వేగంగా ముందుకు వెళ్తున్న ఆ వాహనాన్ని.. పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. ఓ వ్యక్తి పరారు కాగా... ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేస్తే అందులో 57 ప్యాకెట్ల గంజాయి దొరికింది. మహారాష్ట్ర నంబరుతో ఉన్న ఆ స్కార్పియో వాహనాన్ని సీజ్ చేసి... నిందితుల్ని నకిరేకల్ ఠాణాకు తరలించారు.
ఇదీ చూడండి:కన్నా.. బెంగ వద్దురా అనడమే అసలైన మందు.!