తెలంగాణ

telangana

ETV Bharat / state

పైలెట్లకు శాపంగా ఏవియేషన్‌ అకాడమీల లోపాలు! - helicopter crash latest

ఏవియేషన్‌ అకాడమీల లోపాలు పైలెట్లకు శాపంగా మారుతున్నాయి. అనుభవం కలిగిన శిక్షకులు తగినంత మంది లేకపోవడం, శిక్షణకు ముందు శ్వాస పరీక్షలు నిర్వహించకపోవడం, విమానాలు ఫిట్‌నెస్‌ లేకపోవడం వంటి లోపాలు గతంలో జరిగిన ప్రమాదాల సమయంలో డీజీసీఏ విచారణలో తేలాయి.

chopper crashes
chopper crashes

By

Published : Feb 27, 2022, 10:48 AM IST

పైలెట్‌ కావాలనేది చాలా మంది యువత కల. స్తోమత లేకపోయినా లక్షలు చెల్లించి ఏవియేషన్‌ శిక్షణ కేంద్రాల్లో చేరుతున్నారు. అకాడమీల నిర్వహణ వైఫల్యాలు పైలట్ల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. నల్గొండ జిల్లాలో శనివారం జరిగిన శిక్షణ విమాన ప్రమాదంలో మహిళా శిక్షణ పైలెట్‌ మృతితో మరోసారి ఏవియేషన్‌ అకాడమీలపై సందేహాలు తలెత్తుతున్నాయి.

అనుభవాలు.. నేర్పని పాఠాలు..

హైదరాబాద్‌ విమానయాన కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. రాజధానిలో పలు ఏవియేషన్‌ శిక్షణ కేంద్రాలున్నాయి. 1.5-2 ఏళ్ల వ్యవధి కల్గిన శిక్షణకు రూ.40 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. కమర్షియల్‌ పైలెట్‌కు 200 గంటలపాటు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేటు పైలెట్‌ లైసెన్స్‌(పీపీఎల్‌) 40 గంటలు విమానం నడిపిన అనుభవం ఉండాలి. ప్రస్తుతం కూలిన విమానం ఫ్లయిటెక్‌ ఏవియేషన్‌ అకాడమీకి చెందినది. వీరిపై గతంలోనూ ఆరోపణలున్నాయి.

గతంలో ప్రమాదాలు..

2019 అక్టోబర్‌ 6న బేగంపేటలోని వింగ్స్‌ ఏవియేషన్‌కు చెందిన రాజీవ్‌గాంధీ ఏవియేషన్‌ అకాడమీ శిక్షణ విమానం సెస్నా 172 వికారాబాద్‌లోని పంట పొలాల్లో కూలి ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. ః 2018 నవంబరు 21న బేగంపేట నుంచి బయలుదేరిన శిక్షణ విమానం సిటీ శివారు మోకిలలో కుప్పకూలింది. పైలెట్‌ త్రుటిలో బయటపడ్డారు.

నిబంధనల ఉల్లంఘన..

అకాడమీల నిర్వహణ లోపాలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. శిక్షణ మొదట్లో రెండు సీట్లు ఉన్న విమానంలో పక్కన అనుభవం కలిగిన శిక్షకుడు, పక్కన ట్రైనీ పైలెట్‌ ఉంటారు. శిక్షణ కాలం గడిచేకొద్దీ ఒంటరిగా వెళ్లేందుకు ట్రైనీ పైలెట్‌కు అనుమతిస్తారు. అయితే అనుభవం కలిగిన శిక్షకులు తగినంత మంది లేకపోవడం, శిక్షణకు ముందు శ్వాస పరీక్షలు నిర్వహించకపోవడం, విమానాలు ఫిట్‌నెస్‌ లేకపోవడం వంటి లోపాలు గతంలో జరిగిన ప్రమాదాల సమయంలో డీజీసీఏ విచారణలో తేలాయి. విమానయాన రంగంలో ఏదైనా ప్రమాదం జరిగితే మొదట అకాడమీ లైసెన్స్‌ సస్పెండ్‌ చేస్తారు. విచారణ చేపట్టి ప్రమాదానికి కారణం తేలుస్తారు.

ఇదీచూడండి:నల్గొండ జిల్లాలో కూలిన శిక్షణ విమానం... మహిళా పైలట్ మృతి

ABOUT THE AUTHOR

...view details