తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం: మందకృష్ణ మాదిగ - nalgonda latest news

ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్ని పార్టీలు మాటమార్చాయని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. రాబోయే సాగర్ ఉప ఎన్నికల్లో మహాజన సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేస్తామని ప్రకటించారు.

సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం: మందకృష్ణ మాదిగ
Mandakrishna Madiga will contest in Sagar by-election

By

Published : Dec 21, 2020, 7:24 AM IST

ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్ని పార్టీలు మాటమార్చాయని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో మహాజన సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేస్తామని తెలిపారు. తమ అభ్యర్థికి 20 వేల ఓట్లు వస్తే రాబోయే సాధారణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు.

ఇటివల మరణించిన ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కనకరాజు సామెల్ సంతాప సభను ఎమ్మార్పీఎస్, వీహెచ్​పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సామెల్ పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను భరిస్తూ ... ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తామని మందకృష్ణ మాదిగ అన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రాన్ని అమ్మలా కాపాడుకుంటా: గవర్నర్​ తమిళిసై

ABOUT THE AUTHOR

...view details