నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శాంతి నగర్‌కు చెందిన మాదాల సురేశ్.. తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోయారు. అప్పటినుంచి బంధువుల దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం జీవిత అనే యువతితో వివాహం జరిగింది. ఆమెతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితం బయటకు వెళ్లేందుకు ద్విచక్రవాహనాన్ని తీస్తుంటే అదుపు తప్పి అది సురేశ్‌పై పడింది.
ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. తన భార్య జీవిత తో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితం షాపు నుంచి ఇంటికి వస్తుండగా అదుపు తప్పి ద్విచక్రవాహనంపై నుంచి సురేశ్ కిందపడ్డాడు. ఆస్పత్రికి తీసుకువెళ్తే అతడి రెండు తొంటి ఎముకలు విరిగాయని శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. సుమారు రూ.5 లక్షల అప్పు చేసి మరీ అతనికి వైద్యం చేయించారు. సురేశ్ కోలుకోవడానికి దాదాపు సంవత్సరంపైగా సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. అప్పటికీ కోలుకోకపోతే మరో శస్త్రచికిత్స చేయాలని అన్నారు.
ఇంట్లో పనిచేసే ఒక్కడు మంచాన పడటం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భర్త మంచాన పడటం వల్ల జీవిత కూలీ పనికి వెళ్తూ బతుకు బండిని లాగుతోంది. తనకు వచ్చే కూలీ ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదని భర్త మందుల ఖర్చులు మోయలేని భారంగా మారాయని వాపోతోంది.
"నా భర్త బైక్‌పై నుంచి కిందపడ్డాడు. చికిత్సకు రూ.5 లక్షలు ఖర్చు అయింది. ఆ డబ్బు అప్పు చేసి కట్టాం. కానీ నాకు వచ్చే రూ.4వేల జీతంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. మా ఆయన మందులకు నెలకు రూ.30వేలు ఖర్చు అవుతోంది. అంత డబ్బు నేను ఎక్కడినుంచి తీసుకురాగలను. మందులు వేసుకుంటేనే తను త్వరగా కోలుకుంటాడని వైద్యులు చెప్పారు. కానీ అంత డబ్బు పెట్టి మందులు కొనే పరిస్థితులో మేం లేము. ప్రభుత్వం స్పందించి మా మీద దయతలిచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి. అలాగే మా ఇద్దరిలో ఎవరికైనా పింఛను ఇవ్వాలి."