తెలంగాణ

telangana

ETV Bharat / state

'శ్వాస ఆడటం లేదు.. నన్నెవరూ పట్టించుకోవడం లేదు'

నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఆసుపత్రుల్లో కరోనాకు సరైన చికిత్స అందించండం లేదు... చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్​కు రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

man-died-with-corona-in-ibrahimpeta-and-wrote-suicide-note-to-nalgonda-collector
'శ్వాస ఆడటం లేదు.. నన్నెవరూ పట్టించుకోవడం లేదు'

By

Published : Oct 7, 2020, 8:25 AM IST

Updated : Oct 7, 2020, 8:32 AM IST

నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటకు చెందిన ఓ వ్యక్తి... కరోనా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఆసుపత్రుల్లో సరైన చికిత్స అందడం లేదని... చనిపోయే ముందు అతడు కలెక్టర్​కు రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. శ్వాస ఆడటం లేదని ఈ నెల 1న హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్ష చేసుకోగా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

కలెక్టర్​ గారూ స్పందించండి.. కరోనా మృతుడి లేఖ

నాగార్జునసాగర్ ఏరియా ఆసుపత్రిలో రెండు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత పరిస్థితి విషమించడం వల్ల నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందాడు. చనిపోయే ముందు ఆసుపత్రుల్లో తనకు ఎదురైన ఇబ్బందులు, సిబ్బంది తీరు, వసతుల లేమిపై కలెక్టర్​కు లేఖ రాశాడు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరాడు. మృతుని కుమార్తె 3 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. తల్లికి, భార్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం.

ఇదీ చూడండి:భార్య కొట్టడం వల్లే మృతి చెందాడు!

Last Updated : Oct 7, 2020, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details