man commits suicide without paying bike challan: పోలీసులు వేధింపులు భరించలేక మృతి చెందుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతున్నాయి. మెదక్ జిల్లాలో ఖాధీర్ ఖాన్ థర్డ్ డిగ్రీ ఉదంతం.. అదే జిల్లాలో పోలీసులు కొట్టారని యువకుడు కరెంట్ తీగలు పట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన.. నిన్న వరంగల్‌లో దొంగ అనే ముద్ర వేశారని పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటనలే ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి.
తాజాగా నల్గొండ జిల్లాలో ట్రాఫిక్ పెండింగ్ చలానాలు చెల్లించడం లేదని పోలీసులు విచారించడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తన ఆత్మహత్యకు పోలీసులు కారణమంటూ సూసైడ్ నోట్ మృతుడు వద్ద లభించడంతో ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుతున్నాయి. ఈ ఘటనపై పోలీసుల పట్ల కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇది జరిగింది:నల్గొండ జిల్లాకు చెందిన ఎల్లయ్య అనే వ్యక్తి జీవనోపాది కోసమని హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో నీలం సంజీవరెడ్డి నగర్‌లో నివాసముంటూ హమాలీగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో ఎల్లయ్యకు చెందిన ద్విచక్ర వాహనంపై పెండింగ్ చలానాలు ఉండటంతో మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో చలానా కట్టమని చెప్పారు.
దీంతో అతను అప్పులు చేసి బైక్ కొన్నానని అన్ని చలాన్లు ఒకేసారి అంటే కట్టలేనని పోలీసులను వేడుకున్నాడు. కొంత సమయం కావాలని కోరాడు. అతని మాటలను ఏ మాత్రం పట్టించుకొని పోలీసులు ఎట్టిపరిస్థితుల్లో చలానా కట్టి తీరాల్చిందేనని తేల్చిచెప్పారు. దీంతో మనస్తాపానికి గురైనా ఎల్లయ్య ఇంటికి వచ్చి విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గమనించిన కుటుంబ సభ్యులు ఆతన్ని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.