Mallikarjun kharge Election Campaign in Nalgonda :ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో పర్యటించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. యావత్ రాష్ట్ర ప్రజలు ఏకమై అహంకార ధోరణితో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను(CM KCR) గద్దె దించాలన్నారు. మోదీ.. కేసీఆర్ఇద్దరికి మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయన్నారు. మోదీ, కేసీఆర్‌కు పేద ప్రజల కష్టాలు తెలియదని.. పేద ప్రజల కోసం ఇందిరాగాంధీ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు.
ఇందిరమ్మ వంటి మహా నాయకురాలను కూడా కేసీఆర్ దూసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ గొప్ప ప్రాజెక్టును ఇందిరాగాంధీ హయాంలోనే కట్టించారన్నారు. సాగర్ కట్టకపోతే తెలంగాణ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. సోనియాగాంధీ(Sonia Gandhi) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే.. కేసీఆర్ అవినీతి మయంగా మార్చన్నారు.
కేసీఆర్‌ను ఓడిస్తేనే పేదలందరికి ఇళ్లు వస్తాయి : రేవంత్‌రెడ్డి
ధనికులైనా, పేదలైనా.. వెనుకబడిన వర్గాలైనా, దళితులైనా ఎవరు కూడా ఆకలి కడుపుతో చనిపోవద్దని ఇందిరాగాంధీ.. గరీబీ హఠావో కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కానీ కేసీఆర్ ఆమె గురించి హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఇందిరా గాంధీ ఎక్కడ.. కేసీఆర్ ఎక్కడ. డబ్బు కోసమే కేసీఆర్ పాలన చేస్తున్నారు. అవినీతిలో కూరుకుపోయారు. హైదరాబాద్‌ను వదిలి ఫామ్‌హౌస్ నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఈ వ్యక్తి మీకు కావాలా? మరోసారి కేసీఆర్ అధికారంలో కొనసాగాలని మీరు అనుకుంటున్నారా?-మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు