'వైస్ ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలి' - నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం
విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న నల్గొండలోని పానగల్ ఎంజీయూ కళాశాల వైస్ ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పునీత్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
'వైస్ ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలి'
నల్గొండలోని పానగల్‌లోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ పునీత్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపించారు. వైస్ ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.