తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉమ్మడి నల్గొండ జిల్లాలో కిటకిటలాడిన శైవక్షేత్రాలు' - Suryapeta Pillalamarri Temple

మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి... శివున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.

Shivarathri Celebrations
Shivarathri Celebrations

By

Published : Feb 21, 2020, 11:38 AM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని శైవ క్షేత్రాలకు వేకువజాము నుంచే భక్తులు భారీగా వచ్చి... శివున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రం శివారులోని పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి.

గరిడేపల్లి మండలకేంద్రంలోని ఆలయంలో... శివలింగంతోపాటు అమ్మవారి చిత్రపటాన్ని సూర్య కిరణాలు తాకాయి. ఎన్నడూ లేని విధంగా శివరాత్రి రోజే ఇలా జరగడం చూసి... భక్తులు తన్మయత్వం చెందారు. దామరచర్ల వాడపల్లి మీనాక్షీ అగస్త్యేశ్వర ఆలయంలో, సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి ఆలయంలో, మేళ్లచెరువు స్వయంభూ శంభులింగేశ్వర క్షేత్రంలో దేవున్ని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు వచ్చి... శివునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కిటకిటలాడిన శైవక్షేత్రాలు

ఇదీ చూడండి :శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు

ABOUT THE AUTHOR

...view details