నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మూడు గ్రామాల్లో ఏకంగా ఏడుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. త్రిపురారంలో ఓ వృద్ధురాలిపై దాడి చేశాయి. ముఖంపై తీవ్ర గాయాలైన బాధితురాలిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కలు వీధుల వెంట తిరుగుతూ... దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి... కుక్కలు అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పిచ్చికుక్కల స్వైర విహారం... ఏడుగురిపై దాడి... - Mad dog attack on seven villegers
పిచ్చికుక్కలు దాడి చేసి ఏడుగురు తీవ్రంగా గాయపడ్డ ఘటన... నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో చోటుచేసుకుంది. క్షతగాత్రులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
mad-dog-attack-on-seven-villegers