Lovers sucide in nalgonda district: ఆ యువతి.. పెద్దవారిని ఒప్పించి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందామనుకుంది. తన ప్రేమ విషయాన్ని ముందుగా తల్లికి తెలిపింది. కులాంతర ప్రేమ కావడం వల్ల తల్లి నిరాకరించడంతో తండ్రికి చెప్పడానికి భయపడింది. ప్రేమికులిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండటం ఇష్టం లేక చివరకు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. చందంపేట మండలం కాసరాజుపల్లి సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. చెట్టుకు వేలాడుతూ విగతజీవులుగా కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ద్విచక్ర వాహనం, పురుగుల మందు డబ్బా, సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.సూసైడ్ నోట్లు ఇరువురు విడిగా ఒకటి, జంటగా మరొకటి రాసి పెట్టారు. యువతి తన తల్లికి తమ ప్రేమ విషయం చెప్పడంతో రోజు మందలిస్తుండేదని దాంతో విసుగు చెందిన అమ్మాయి చనిపోతా అని అబ్బాయికి చెప్పంది. దీంతో ఇద్దరం కలిసి చనిపోదామని నిర్ణయించుకొని కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు సూసైడ్ నోట్‌ను చదివిన తరువాత గుర్తించారు.