Love Marriage: ఇద్దరూ ప్రేమించుకున్నారు. చదువు పూర్తి చేశారు. ఉద్యోగాల వేటలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలోనే పెద్దలు తమ ప్రేమకు నిరాకరిస్తారని భావించి.. రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. తర్వాత ఎవరింట్లో వారు ఉంటున్న క్రమంలోనే వారి ప్రేమ విషయం కుటుంబసభ్యులకు తెలిసిపోయింది. తమను విడదీసేస్తారనే భయంతో.. ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు.
కుటుంబసభ్యులకు తెలియకుండా వివాహం.. పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట - ప్రేమ వార్తలు
Love Marriage: కుటుంబసభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంట.. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులను ఆశ్రయించింది. కుటుంబసభ్యులు తమకు హాని కలిగించే ప్రమాదం ఉందని.. భద్రత కల్పించాలని యువతీ యువకులు కోరారు.
నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి తురక సందీప్, అమరావతి ప్రియాంకలు చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఇరువురు ఇష్టపడి ప్రేమలో పడ్డారు. ప్రియాంక బీటెక్ పూర్తి చేయగా.. సందీప్ డిగ్రీ చేశాడు. ఇద్దరూ ఉద్యోగ వేటలో ఉన్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు తమ పెళ్లికి నిరాకరిస్తారని భావించారు. ఆ భయంతోనే రహస్యంగా డిసెంబర్ 20న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత యథావిధిగా ఎవరి ఇంటి వద్ద వాళ్లు ఉంటున్నారు. ఈ క్రమంలో వీరి ప్రేమ వివాహం ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులకు భయపడి.. తమకు రక్షణ కల్పించాలని మిర్యాలగూడ పోలీసులను ఆశ్రయించారు.
ఇదీ చూడండి:వ్యవసాయ సహకార సంఘాల్లో స్వాహాకారం.. సొసైటీల్లో అవినీతి పర్వం