నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రద్దీగా ఉండే ప్రదేశాలను డీసీపీ వెంకటేశ్వరరావు పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. ముఖ్యంగా కూరగాయల మార్కెట్, కిరాణ మార్కెట్లను తనిఖీ చేసి.. కొవిడ్ నియంత్రణకు భౌతిక దూరం పాటించని వారిపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత స్థానిక డీఎస్పీ కార్యాలయంలో కూరగాయల మార్కెట్, కిరాణ మార్కెట్ అసోసియేషన్ వారితో సమావేశం ఏర్పాటు చేసి.. పలు సూచనలు చేశారు.
నల్గొండలో పటిష్టంగా లాక్డౌన్ అమలు - నల్గొండలో పటిష్టంగా లాక్డౌన్ అమలు
నల్గొండ జిల్లాలో పోలీసులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. మిర్యాలగూడలో డీసీపీ వెంకటేశ్వరరావు పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు.
lockdown implementation
షాపు యజమానులు వినియోగదారులను భౌతిక దూరం పాటించేలా.. మాస్కులు, గ్లౌజులు తప్పనిసరిగా వేసుకునేలా చూడాలని సూచనలు చేశారు. మార్కెట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేసుకోవాలని డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవాలని కోరారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టడంలో అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇవీ చూడండి:పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్