తెలంగాణ

telangana

ETV Bharat / state

తగ్గని తీవ్రత.. నల్గొండలోని 5 నియోజకవర్గాల్లో యథావిధిగా లాక్‌డౌన్‌! - nalgonda district latest news

నల్గొండ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు లాక్‌డౌన్‌ యథావిధిగా కొనసాగనుంది. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ.. ఆ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ అదుపులోకి వచ్చేంత వరకు ఆయా ప్రాంతాల్లో సడలింపు సమయం ఒంటిగంట వరకే ఉండనుంది.

నల్గొండలోని 5 నియోజకవర్గాల్లో యథావిధిగా లాక్‌డౌన్‌!
నల్గొండలోని 5 నియోజకవర్గాల్లో యథావిధిగా లాక్‌డౌన్‌!

By

Published : Jun 9, 2021, 6:38 AM IST

నల్గొండలోని 5 నియోజకవర్గాల్లో యథావిధిగా లాక్‌డౌన్‌!

కొవిడ్ తీవ్రత దృష్ట్యా నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మినహా మిగతా ఐదు నియోజకవర్గాల్లో యథావిధిగా లాక్‌డౌన్‌ అమలు కానుంది. నల్గొండ, మునుగోడు, నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాలకు.. మినహాయింపు వర్తించలేదు. ఆయా నియోజకవర్గాల్లో మరో తొమ్మిది రోజుల పాటు యథావిధిగా లాక్‌డౌన్ కొనసాగనుంది.

రాష్ట్రంలో ఏడుచోట్ల ఇపుడున్న పద్ధతే అమలు కానుండగా.. అందులో ఐదు నియోజకవర్గాలు నల్గొండ జిల్లాలోనే ఉన్నాయి. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కేసుల తీవ్రత 8-10 శాతం మధ్య ఉంటోందని అధికార గణంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్ మూడు, నాలుగు వారాల్లో 20-26 శాతం పాజిటివిటీ రేటు ఉండగా.. మే మొదటి, రెండో వారాల కల్లా 30-36 శాతానికి చేరింది. గత నెలలో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న యాదాద్రి జిల్లాలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కట్టడిని పకడ్బందీగా అమలు చేయడంతో సత్ఫలితాలు వచ్చాయి. అదే విధానాన్ని నల్గొండ, సూర్యాపేటలో అమలు చేయాలన్న లక్ష్యంతో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ రెండు జిల్లాల్లో పర్యటించారు. వెలుగుచూస్తున్న కేసులు, నమోదవుతున్న గణాంకాలకు పొంతన లేకపోవడంతో రిజ్వీ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి కేసుల తీవ్రత 8-10 శాతం ఉంటుందని చెబుతున్నా.. లాక్‌డౌన్ యథావిధిగా కొనసాగించాలన్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

పీహెచ్​సీలు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా దవాఖానాలో.. రోజుకు 8 వేల పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో.. ఇంటింటి సర్వే చేశారు. పరిశ్రమలు, అనుమానితులు ఎక్కువున్న ప్రాంతాల్లో పరీక్షల సంఖ్య మూడింతలు చేశారు. వచ్చే వారానికల్లా కేసుల్ని 5 శాతం లోపునకు తీసుకు రావాలని ఎక్కడిక్కడ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా.. పరిస్థితిలో మార్పు కనపడలేదని మంత్రివర్గ నిర్ణయాన్ని బట్టి అర్థమవుతోంది.

ఇదీ చూడండి: రాష్ట్రంలో నాలుగు రెట్లు పెరిగిన శాస్త్రవేత్తల వేతనాలు

ABOUT THE AUTHOR

...view details