తెలంగాణ

telangana

ETV Bharat / state

నోముల గ్రామంలో భారీగా మద్యం పట్టివేత - liquor caught in nomula village

నల్గొండ జిల్లా నోముల గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా నిల్వ చేసిన 40 కార్టన్ బీర్లు, 5 మద్యం కార్టన్లు, 100 కిలోల కల్తీ కల్లు తయారు చేసే క్లోరల్ హైడ్రేట్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు

నోముల గ్రామంలో భారీగా మద్యం పట్టివేత

By

Published : Sep 28, 2019, 3:21 PM IST

నల్గొండ జిల్లా నకిరేకల్​ మండలం నోముల గ్రామంలో మద్యం దుకాణంపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ముందస్తు సమాచారంతో గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 40 కార్టన్ బీర్లు, 5 మద్యం కార్టన్లు, 100 కిలోల కల్తీ కల్లు తయారు చేసే క్లోరల్ హైడ్రేట్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్లోరల్ హైడ్రేట్​ను ఈ నెల 18న బీవండిలో బుక్​ చేశారని తెలిపారు. వీటితో పాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

నోముల గ్రామంలో భారీగా మద్యం పట్టివేత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details