నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గొట్టిముక్కల జలాశయం నిర్మాణ పనులను లింగన్నబావి గ్రామస్థులు అడ్డుకున్నారు. నాలుగేళ్లుగా పరిహారం ఇస్తామంటూ ప్రభుత్వం తమను మోసం చేస్తోందని ఆరోపించారు. రెండు నెలల క్రితం అధికారులు ఈనెల 17న పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారని.. అయినా నేటికి ఎటువంటి స్పందన లేదని వాపోయారు. పరిహారం చెల్లించేవరకు పనులు జరగనివ్వమని గ్రామస్థులు తేల్చిచెప్పారు. ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములను కోల్పోతున్నామిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
'పరిహారం చెల్లించేవరకు పనులు జరగనివ్వం' - లింగన్నబావి
నల్గొండ జిల్లాలో గొట్టిముక్కల జలాశయం నిర్మాణ పనులను లింగన్నబావి గ్రామస్థులు అడ్డుకున్నారు. పరిహారం చెల్లించేవరకు పనులు జరగనివ్వమని తేల్చిచెప్పారు.

'నష్టపరిహారం చెల్లించేవరకు పనులు జరగనివ్వం'