నాగార్జున సాగర్‌కు (NAGARJUNA SAGAR) ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో 6 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు(sagar 6 crust gates opened). ప్రాజెక్టు నుంచి 48,474 క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే ద్వారా వదులుతున్నారు.
NAGARJUNA SAGAR: సాగర్‌కు పోటెత్తుతున్న వరద.. 6 క్రస్ట్ గేట్లు ఎత్తివేత - nalgonda district news
ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో నాగార్జునసాగర్(NAGARJUNA SAGAR)జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 92,441 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి 48,474 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు (sagar 6 crust gates opened).
![NAGARJUNA SAGAR: సాగర్‌కు పోటెత్తుతున్న వరద.. 6 క్రస్ట్ గేట్లు ఎత్తివేత NAGARJUNA SAGAR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13228208-754-13228208-1633076191750.jpg)
NAGARJUNA SAGAR
ప్రాజెక్టులోకి 92, 441 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 48,474 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.44 టీఎంసీలకు చేరింది. ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహాన్ని గమనిస్తూ గేట్ల సంఖ్య పెంచడం లేదా తగ్గించడం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సాగర్‌కు పోటెత్తుతున్న వరద.. 6 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
ఇదీ చదవండి:Assembly Sessions 2021: పర్యాటకులు అసౌకర్యం కల్పిస్తే జైలు, జరిమానా