తెలంగాణ

telangana

ETV Bharat / state

'సంక్షేమంలో దేశంలోనే తెలంగాణది అగ్రస్థానం' - Distributed Laddus in Miryalaguda Latest News

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పర్యటించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుమల లడ్డూ ప్రసాదం పంపిణీ కౌంటర్​ను ప్రారంభించారు.

తిరుమల లడ్డూలను పంపిణీ చేసిన గుత్తా
తిరుమల లడ్డూలను పంపిణీ చేసిన గుత్తా

By

Published : Jun 3, 2020, 6:43 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డులోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుమల లడ్డూ ప్రసాదం కౌంటర్​ను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం భక్తులకు లడ్డూలను అందజేశారు. రైతు మెగా రుణ మేళా కార్యక్రమంలో గుత్తా పాల్గొన్నారు. మండలి ఛైర్మన్​గా కొనసాగుతూ రాజకీయాలు మాట్లాడొద్దని అంటూనే కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేశారు. కాంగ్రెస్​లో పీసీసీ అధ్యక్షుడి విషయంలో స్పష్టత లేని వారికి, పార్టీని నడిపించలేని వారికి అధికారం అప్పగిస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ తరలింపునకు ఒప్పుకోం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తరలించాలని చూస్తోందని... ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు ఒప్పుకునేదే లేదని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం.. పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్​ల ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని ఏపీకి తరలించాలని ప్రయత్నిస్తోందన్నారు.

ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది..

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అధీనంలోని కృష్ణా రివర్ బోర్డుకు, అపెక్స్ కమిటీకి లేఖలు రాసి ఏపీ నిర్ణయాన్ని ఆపేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. 2004లో 44 వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తరలించడానికి శ్రీకారం చుట్టింది.. కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ధర్నాలు చేస్తున్న వారే అప్పట్లో మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు.

ఇవీ చూడండి : ఒంట్లో సత్తువే లేదు.. వేలిముద్ర వేయనిదే పింఛన్​ రాదు

ABOUT THE AUTHOR

...view details