దేశంలో రైతు బీమా ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన.. ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలిసి పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలకు..
అడవి దేవులపల్లిలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనంతో పాటు.. మండల రిసోర్స్ సెంటర్ భవనాన్ని ఎమ్మెల్యే భాస్కర్ రావుతో కలిసి గుత్తా ప్రారంభించారు. అనంతరం ఇటీవల మంజూరైన ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు.