నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్తో కలిసి పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో గ్రంథాలయం, మినీ బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, మున్సిపాలిటీ కార్యాలయం భవన ప్రారంభోత్సవం చేశారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు భారీ నష్టం వాటిల్లిందని గుత్తా అన్నారు. వరి, పత్తి పంటల నష్టాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు వివరాలు సేకరించాలని ఆదేశించారని తెలిపారు.