తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్​లో లాంచీ సేవలు పునః ప్రారంభం

నాగార్జునసాగర్​ జలాశయంలో నేడు లాంచీ ట్రయల్స్ ప్రారంభించారు. కచ్చులూరు బోటు ప్రమాదం అనంతరం ఇక్కడ లాంచీ ప్రయాణాన్ని నిలిపివేశారు. పర్యాటకశాఖ అనుమతితో సేవలు పునః ప్రారంభించారు.

సాగర్​లో లాంచీ సేవలు పునప్రారంభం

By

Published : Nov 24, 2019, 5:25 PM IST

నాగార్జునసాగర్ జలాశయంలో చాలా రోజుల తర్వాత లాంచీ ప్రయాణం పునః ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదం జరిగిన తర్వాత సాగర్​లో లాంచీ ప్రయాణాన్ని తెలంగాణ పర్యాటకశాఖ అధికారులు నిలిపివేశారు. పర్యాటకశాఖ అధికారులు అనుమతులు మంజూరు చేసినందున... జలాశయంలో నేడు ట్రయల్స్​ వేశారు. శనివారం నుంచే ప్రారంభంకావాల్సి ఉండగా... ప్రయాణికులు లేనందున ఈ నెల 30న సేవలు అందుబాటులోకి తేనున్నారు. నాగార్జున కొండకు వెళ్లేందుకు మాత్రం ఇంకా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

సాగర్​లో లాంచీ సేవలు పునప్రారంభం

ABOUT THE AUTHOR

...view details