నాకు గర్వకారణంగా ఉంది: కేటీఆర్ - trs working president
ఈ రోజు చాలా ఆనందం, సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న నల్గొండకు సురక్షితమైన తాగునీరు అందించడం గర్వకారణంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మిషన్ భగీరథ అధికారుల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, మిషన్ భగీరథ అధికారుల అంకితభావంతో ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ రోజు చాలా ఆనందంగా ఉందన్నారు. ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న నల్గొండకు తాగునీరు అందించడం గర్వకారణంగా ఉందని తెలిపారు. తాగు నీరు సమస్య ఎందుర్కొంటున్న తెలంగాణ ప్రజలకు పరిష్కారం చూపించామన్నారు.