నల్గొండ జిల్లాలోని (nalgonda district) నాగార్జున సాగర్ జలాశయాన్ని(Nagarjuna Sagar reservoir) కృష్ణానదీ యాజమాన్యబోర్డు సభ్యులు (krmb board members) సందర్శించారు. సాగర్ జలాశయం ఎస్ఈ.. ధర్మ ఆధ్వర్యంలో బోర్డు సభ్యులు టి.కె. శివారాజన్ నేతృత్వంలో అనుపమ్ ప్రసాద్, త్రినాథ్... జలాశయాన్ని పరిశీలించారు. జలాశయం క్రస్ట్ గేట్లను, స్పిల్ వే, కంట్రోల్ రూమ్‌ను, సాగర్ కుడి, ఎడమ కాలువలతో పాటు ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు.
నాగార్జున సాగర్‌లో కేఆర్ఎంబీ బోర్డు సభ్యుల సందర్శన.. ఆ విషయాలపై ఆరా - సాగర్ జలాశయాన్ని పరిశీలించిన కేఆర్ఎంబీ బోర్డు సభ్యులు
నాగార్జునసాగర్ జలాశయాన్ని (Nagarjuna Sagar reservoir) కృష్ణానదీ యాజమాన్య బోర్డు సభ్యులు (krmb board members) సందర్శించారు. జలాశయం క్రస్ట్‌గేట్లను, స్పిల్‌వే, కంట్రోల్‌రూమ్‌తో పాటు సాగర్ కుడి, ఎడమ కాలువలను, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు.
తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపు విషయంలో విభేదాలు తెర పైకి వస్తున్న నేపథ్యంలో కేఆర్ఎంబీ బోర్డు సభ్యుల పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సాగర్ జలాశయం నీటి విడుదల, విద్యుత్ ఉత్పత్తి తదితర వివరాలను జలాశయం అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగర్‌కు సంబంధించిన అన్ని విషయాలను, కాలువల పరిస్థితి గురించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో నాగార్జున సాగర్ జలాశయం డీఈ, ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Nagarjuna Sagar Dam: దెబ్బతిన్న స్పిల్‌వే... 8 గేట్ల దిగువ భాగంలో భారీ గుంతలు!