తెలంగాణ

telangana

ETV Bharat / state

KRMB Subcommittee: 15, 16లలో సాగర్‌కు కృష్ణా బోర్డు ఉప సంఘం - సాగర్​లో కృష్ణా బోర్డు ఉపసంఘం సమావేశం

గతనెలలో శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి ఔట్​లెట్లను పరిశీలించిన ఉపసంఘం (KRMB Subcommittee)... ఈ నెలలో 15,16 తేదీల్లో నాగార్జునసాగర్​కు వెళ్లనుంది. రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలోని కంపోనెంట్లను పరిశీలించి రెండోరోజు మధ్యాహ్నం రెండు రాష్ట్రాల సభ్యులతో ఉప సంఘం (KRMB Subcommittee) సాగర్‌లో సమావేశం నిర్వహించనుంది.

KRMB Subcommittee
కృష్ణా బోర్డు ఉప సంఘం

By

Published : Nov 12, 2021, 8:44 AM IST

కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకునేందుకు కృష్ణా బోర్డు (Krishna River Management Board) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత నెలలో జరిగిన బోర్డు (Krishna River Management Board) సమావేశంలో అప్పగించేందుకు గుర్తించిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో కంపోనెంట్లను క్షేత్రస్థాయిలో సందర్శించాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ఈ నెల 15, 16 తేదీల్లో ఉప సంఘం (KRMB Subcommittee) నాగార్జునసాగర్‌కు వెళ్లనుంది. రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలోని కంపోనెంట్లను పరిశీలించి రెండోరోజు మధ్యాహ్నం రెండు రాష్ట్రాల సభ్యులతో ఉప సంఘం (KRMB Subcommittee) సాగర్‌లో సమావేశం నిర్వహించనుంది.

ఈ మేరకు బోర్డు (Krishna River Management Board) ఓప్రకటనను విడుదల చేసింది. గతంలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ఔట్ లెట్లను పరిశీలించిన ఉప సంఘం... 15వ తేదీన ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పంప్ హౌస్, సాగర్ స్పిల్ వే, స్లూయిస్, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కుడి కాల్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్లను పరిశీలించనుంది. 16వ తేదీన సాగర్ ఎడమ కాల్వ పవర్ హౌస్, ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్, వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్‌లను పరిశీలిస్తారు. అదే రోజు మధ్యాహ్నం సాగర్‌లో ఉపసంఘం (KRMB Subcommittee) సమావేశం జరగనుంది.

23న పోలవరంపై కేంద్రం సమీక్ష

ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన, సత్వర సాగునీటి ప్రయోజన పథకం, ఆయకట్టు అభివృద్ధి-నీటి నిర్వహణ కార్యక్రమం పథకాల కింద రూ.500 కోట్లకు పైగా నిధులతో ఏపీలో చేపట్టిన ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఈనెల 23న దిల్లీలో కేంద్రం సమీక్ష నిర్వహించనుంది. శ్రమశక్తి భవన్‌లో ఏర్పాటు చేయనున్న ఈ సమావేశంలో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు పనులపై చర్చించనున్నట్లు గురువారం జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి:jal shakti Gazette: 'జల్​శక్తి గెజిట్​ అమలు వేగవంతమయ్యేలా చూడండి'

TELANGANA LETTER TO KRMB: 'నాగార్జునసాగర్ కాలువల వద్ద అసమానతలు సరిదిద్దండి'

ABOUT THE AUTHOR

...view details