తెలంగాణ

telangana

ETV Bharat / state

జీవో నెంబర్​ 246 రద్దుచేయాలి, లేకుంటే దీక్ష చేస్తానని కోమటిరెడ్డి వార్నింగ్ - జీవో నెం 246

komati reddy on go 246 నల్గొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాల ప్రజల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేస్తూ జీవో 246 తీసుకొచ్చారని అన్నారు. దీంతో నల్గొండ జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కృష్ణా నది నుంచి ఏపీ సీఎం జగన్‌ 8 నుంచి 11 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోందని విమర్శరించారు

mp kvr press meet
mp kvr press meet

By

Published : Aug 28, 2022, 8:36 PM IST

komati reddy on go 246: రైతులకు నష్టం కలిగించేలా సీఎం కేసీఆర్‌ చర్యలు ఉంటున్నాయని భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ విధానాలతో నల్గొండ రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు. ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేస్తూ జీవో 246 తీసుకొచ్చారని.. దీంతో నల్గొండ జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.

జీవోనెం 246: 1980లో జరిగిన ఒప్పందం ప్రకారం నల్గొండ ప్రజలకు ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 45 టీంఎసీల కేటాయింపులు జరిగాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8ఏళ్లు గడిచినా నల్గొండ జిల్లా రైతాంగానికి ఇంకా అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా జిల్లాకు దక్కాల్సిన 45టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్‌ 246ని తెచ్చిందని.. నల్గొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాల ప్రజల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు.

కృష్ణా నది నుంచి ఏపీ సీఎం జగన్‌ 8 నుంచి 11 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని విమర్శించారు. జీవో నెంబర్‌ 246ని వెంటనే రద్దు చేయాలని లేదంటే జిల్లా కేంద్రంలో దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జీవో రద్దు చేయాలని సీఎంకి లేఖ రాస్తానని.. అవసరమైతే అపాయింట్‌మెంట్‌ తీసుకుని కలుస్తానన్నారు. ఎస్‌ఎల్‌బీసీ 30టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డికి 40, డిండి ఎత్తిపోతలకు 20 టీఎంసీల నీరు కేటాయించాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఈ నెల 18న అక్రమంగా తెలంగాణ ప్రభుత్వం జీవో నెం 246 విడుదల చేసింది. దీని వలన నల్గొండ రైతాంగం చాలా ఇబ్బందులు ఎదర్కొంటోంది. 1980లో జరిగిన ఒప్పందం ప్రకారం నల్గొండ ప్రజలకు ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 45 టీంఎసీల కేటాయింపులు జరిగాయి. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్‌ 246ని తెచ్చింది. నల్గొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాల ప్రజల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జీవో నెంబర్‌ 246ని వెంటనే రద్దు చేయాలని లేదంటే జిల్లా కేంద్రంలో దీక్ష చేయడానికి సిద్ధం..-కోమటిరెడ్డి వెంకటరెడ్డి

జీవో నెంబర్​ 246 రద్దుచేయాలి, లేకుంటే దీక్ష చేస్తానని కోమటిరెడ్డి వార్నింగ్

ఇవీ చదవండి:



ABOUT THE AUTHOR

...view details