Rajagopal Reddy as BJP National working group member : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ జాతీయ నాయకత్వం సంస్థాగత మార్పులు చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీలో కీలక మార్పులు చేసిన అధిష్ఠానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. రాజగోపాల్‌రెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Komatireddy Rajagopal Reddy : బీజేపీ జాతీయకార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి - రాజగోపాల్‌రెడ్డి తాజా వార్తలు
18:33 July 05
Komatireddy Rajagopal Reddy : బీజేపీ జాతీయకార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
BJP Highcommand focus on TS Assembly Elections : మంగళవారం తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన భారతీయ జనతాపార్టీ తాజాగా రాజగోపాల్‌రెడ్డిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అలాగే నిన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని... జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. ఈ నియామకాలపై ఉత్తర్వులు వచ్చిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... ఇటీవలె కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. ఈ భేటీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైన వేళ... బీజేపీ ఇవాళ రాజగోపాల్‌రెడ్డిని పార్టీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీలో మార్పులు :మరోవైపు రాష్ట్రంలో మూడేళ్లకు పైగా కీలక సమయంలో పార్టీకి సేవలందించి, బలోపేతం చేసిన బండి సంజయ్‌కు సముచిత ప్రాధాన్యం కల్పించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌లో అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని కొందరు నాయకులు అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును మంగళవారం దిల్లీకి రప్పించడంపైనా చర్చ జరుగుతోంది. రాజ్యసభ్యుడు లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కూడా పదవులపై ఆశాభావంతో ఉన్నారు. కేంద్రమంత్రి పదవులు కాకుంటే పార్టీ జాతీయ వ్యవహారాల్లో భాగస్వామ్యం వంటి అవకాశాలివ్వవచ్చని చర్చ జరుగుతోంది. ఇప్పటికే తనదైన వ్యూహాలతో ముందుకెళ్తున్న బీజేపీ... సారథి మార్పు నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాలపై జాతీయ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ చూపనుందని సమాచారం. ప్రధాని మోదీ వరంగల్ పర్యటన అనంతరం పూర్తిస్థాయిలో దృష్టిసారించనుందని, పూర్తిస్థాయిలో పరిధులను నిర్దేశించి బాధ్యతల్ని అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి :